Header Banner

జూన్ నెలలో బ్యాంకు సెలవులు! ఎన్ని రోజులు అంటే?

  Sat May 24, 2025 18:10        Others

ఇంకొన్ని రోజుల్లో జూన్ 2025 రాబోతోంది. అయితే ఈ నెలలో మీకు ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా. ఉంటే మాత్రం ఈ సెలవుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి. ఈ క్రమంలో ఎన్ని రోజులు బ్యాంకులు (Bank Holidays June 2025) పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 

మే నెల దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో జూన్ రానుంది. ఈ నేపథ్యంలో జూన్ 2025లో ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవు దినాలు ఉన్నాయనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ సెలవులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడ్డాయి. సాధారణంగా బ్యాంకు సెలవులు (Bank Holidays June 2025) అనేక మందిని ప్రభావితం చేస్తాయి. జూన్ నెలలో బ్యాంకులు 12 రోజుల పాటు బంద్ ఉంటాయి. ఇందులో స్థానిక పండుగలు, జాతీయ సెలవులు, రెండో, నాల్గవ శనివారాలు, అలాగే ఆదివారాలు ఉన్నాయి. ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి.

 

జూన్ 2025 బ్యాంకు సెలవుల జాబితా

  • జూన్ 6, 2025 – ఈద్-ఉల్-అదా (బక్రీద్): ఈ రోజు తిరువనంతపురం, కొచ్చిలో బ్యాంకులు మూసివుంటాయి.

  • జూన్ 7, 2025 – బక్రీద్ (ఈద్-ఉజ్-జుహా): ఈ రోజు దాదాపు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివుంటాయి. అగర్తలా, ఐజ్వాల్, బెలాపూర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), ఇంఫాల్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోహిమా, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ, పణజి, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్‌లలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

  • జూన్ 11, 2025 – సంత్ గురు కబీర్ జయంతి /సాగా దావా: ఈ రోజు గ్యాంగ్‌టక్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు. సంత్ గురు కబీర్ జయంతిని ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరుపుకుంటారు. సిక్కింలో కూడా ఇది ముఖ్యమైన బౌద్ధ పండుగ.

  • జూన్ 27, 2025 – రథయాత్ర /కాంగ్ (రథజాత్ర): భువనేశ్వర్, ఇంఫాల్‌లో ఈ రోజు బ్యాంకులకు సెలవు. రథ యాత్ర ఒడిశాలో జరిగే ఒక ప్రముఖ హిందూ పండుగ, ఇది భగవాన్ జగన్నాథుని గౌరవార్థం జరుపుకుంటారు.

  • జూన్ 30, 2025 – రెమ్నా నీ: ఐజ్వాల్‌లో ఈ రోజు బ్యాంకులకు సెలవు. రెమ్నా నీ అనేది మిజోరాంలో జరిగే స్థానిక పండుగ, ఇది స్థానిక సంస్కృతికి సంబంధించినది.

  • జూన్ 14, జూన్ 28 తేదీలలో రెండు, నాల్గో శనివారాలు బ్యాంకులకు హాలిడే

  • జూన్ 2025లో మొత్తం 5 ఆదివారాలు ఉన్నాయి (జూన్ 1, 8, 15, 22, 29). ఈ రోజుల్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.


సెలవు రోజుల్లో బ్యాంకింగ్ సేవలు

బ్యాంకులు మూసివున్నప్పటికీ సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు ఆన్‌లైన్‌లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ, డిజిటల్ వాలెట్‌లు, ఏటీఎంల ద్వారా మీరు సెలవు రోజుల్లో కూడా డబ్బు బదిలీ, బిల్ చెల్లింపులు చేసుకోవచ్చు. అందుకే బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ సేవలు మాత్రం మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాలని బావిస్తే.. బ్యాంకింగ్ సెలవులను దృష్టిలో ఉంచుకుని మీ ఆర్థిక పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

 

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు షెంజెన్ వీసాల తిరస్కరణ! 17 లక్షల దరఖాస్తులు..!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! రేషన్ హోమ్ డెలివరీ.. ఎవరెవరికంటే!

 


ఇసుక స్కాం బట్టబయలు.. SIT దృష్టిలో ఆ నలుగురు! ఒక్కటైపోయిన..

 

జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!



నేడు (24/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!



ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #AndhraPravasi #BankHolidays #JuneHolidays #HolidayAlert #PublicHoliday